బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం - ప్రాచీన కవి ప్రణీతం


 బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం -  ప్రాచీన కవి ప్రణీతం


ఇది శ్రీ మదజ్జాడాదిభట్ల నారాయణ దాసు గారికి స్నేహితుడైన ముక్తేవి పాలంరాజు గారి రచన.మామూలుగా మా వూరు అప్పట్లో తేలప్రోలు సంస్థానంలో భాగంగా వుండేది.కానీ ఈ కవిగారూ వర్ణకవి నాగరాజు అనే సంగీత విద్వాంసుడూ విజయనగర సంస్థానానికి దఖలు పడ్డారు.ఇక్కణ్ణించే అక్కడికి వెళ్ళి వస్తూ వుండేవాళ్ళు. ఆయన స్నేహితులొకరు  చాలాకాలం పాటు పిల్లలు కలగక ఇబ్బంది పడుతుంటే ఈ బీజాక్షరాలు గర్భితం చేసిన దండకాన్ని వ్రాసి ఇచ్చి దీనితో నీ కోరిక నెరవేరుతుందని భరోసా ఇస్తే ఆ తర్వాత దీని పారాయణ ఫలితంగా నలుగురు పిల్లలు పుట్టారట.  
.. 

శ్రీ మన్మహా అంజనీ గర్భసంభూత!సద్బ్రహ్నచారీ!కపీంద్రాది ముఖ్యా!లసద్ వజ్రతుల్య కపోలా మహారత్న సత్కుండలా కర్ణ!మౌంజీ ధరా!దీప్త యజ్ఞోపవీతాయ!కాలాగ్ని రుద్రాయ!శ్రీరామ పాదారవిందాయ!సుభ్రుంగాయ మానాంగ జంభాసురా!రంగనాధాయ!సిధ్ధాంత రంగప్రరంగేశ సంధాన!నీలాంగదా జాంబవంత సుషేణాం గవాక్ష నలానీల సంసేవ్యమానా!గిరీంద్రా నివాసాయ!

మహోఛ్ఛాటనోఛ్ఛాటనో సాగరోల్లంఘనా!లంఖిణీ మర్దనా!రాము కార్యైక నిర్వాహకా!ఘోర లంకాపురీ దాహకా!దానవాధీశ్వర సౌధాంగణోద్భంగ!వహ్ని ప్రభా మండలోధ్ధండ!మార్తాండ!చండస్పురద్భాహుదండా!మహావీర హనుమంత!మా చిత్తమందుండుమీ! మమ్ము రక్షించుమీ! వాయువేగ మనోవేగ సన్నాహ సాధ్యా!సునాశీర ముఖ్యుల్ సురల్ నిన్ను వర్ణించి లెక్కింపగా శక్తులే!వానరేంద్రా సమీరాత్మ జాతాంజనేయా!నినున్ గొల్చెదన్ యేలుకొమ్మా నమస్తే నమో!__

అక్షయశ్శిక్షణా!లక్ష్మణ ప్రాణ సంరక్షణా!సర్వబృందారకాధార మందార!ఝాం ఝాంకార ఝుం ఝుం ఝుణత్కార!ఠాం ఠాంకార!పాహిమాం పాహిమాం పాహిమాం!పోషణం ణణ్ణణ్ణణ్ణాం హోంషిణీం హ్రీం హ్రీంకార!ఆహా ఆహహా ఆహహా హాసస్పురచ్చంద్రికా కుంద మందార!హాస్వాను బంధు స్వరోల్లాస!నిత్యగ్రహా బంధు!యంత్రగ్రహా బంధు!తంత్రగ్రహా బంధు!క్షుత్పిపాసాగ్రహా!భీమ పైశాచికా!శాకినీ ఢాకినీ యక్షిణీ కామినీ భైరవీ దేవి శక్తిగ్రహా!

కర్షణోత్కర్షణో ఛ్ఛాటనోఛ్ఛాటనో ఛింది ఛిందీ కుఠారేణు బంధింప రా వేగరావే హనూమంత సంజీవరాయా పరాకా వడిన్ లెమ్ము లేలెమ్ము నీవిప్పుడున్ దీని పట్టి బంధించుమీ వాలమున్ జుట్టుమీ నేలపై గొట్టుమీ గుండెలున్ ప్రేవులున్ రక్తధారాజ్యముల్ గాగ హోమాగ్నిలో భూతకృత్యన్ దగన్ జేయుమీ!

వహ్నికిన్ రావణున్ కుంభకర్ణాదులన్ గూల్చి తెభ్భంగి తభ్భంగి గూల్చుమీ నీకునా రాము నాజ్ఞే సుమీ యో హనుమంత నీతిమంత బుధ్ధిమంత సురద్వేషమంత హ్రాం ఖఖంఖం భభంభం భూభుగల్ పుట్టరారో ఛిందిఛిందీ మహిన్ మారులన్ దుర్గకున్ మారుమీ కాళికిన్ మారుమీ ఛండికిన్ మారుమీ కాకుళాధీశ ముక్తేవి శ్రీరామ దాసాయ తుభ్యం నమస్తే నమస్తే నమః


Comments

Popular posts from this blog

SRI VIDYA GANAPATI VANCHA KALPALATA MANTRA

Sani Pradosha Stotram (శని ప్రదోష స్తోత్రం )

June 22, 1897: The Chapekar Brothers Strike — A Militant Statement in Pune’s Plague Crisis