Pitru Stuthi - Brudh Dharma Purana
పితృస్తుతి బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టినరోజునాడు తండ్రికి నమస్కరించి వారివద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ఉవాచ: 1. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ! సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే!! ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. 2. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే! సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!! సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః! సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!! సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప...