Posts

Showing posts with the label కాలభైరవ అష్టకం

కాలభైరవ అష్టకం

Image
  కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో): 1.  దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. 2.  భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. 3.  శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శ...