శ్రీనాథ విరచిత పద్యము
శ్రీనాథ మహాకవి వ్రాసిన ఒక అందమయినపద్యం పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ "భీమఖండము" లో ఎంత అందంగా చిత్రించాడో చూడండి. ఆ ఆది దంపతుల దివ్యదర్శనం అవుతుంది. చంద్రబింబానన, చంద్రరేఖామౌళి నీలకుంతలభార, నీలగళుఁడు ధవళాయతేక్షణ, ధవళాఖిలాంగుండు మదనసంజీవని, మదనహరుఁడు నాగేంద్రనిభయాన, నాగకుండలధారి భువనమోహనగాత్ర , భువనకర్త గిరిరాజకన్యక, గిరిరాజనిలయుండు సర్వాంగసుందరి, సర్వగురుఁడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక రత్న పాదుకలు మెట్టి చెట్టలు పట్టుకొనుచు ఏగుదెంచిరి వయ్యార మెసగ మెసగ విహరణక్రీడ మాయున్న వేదికపుడు పద్యములోని నాలుగు పాదాల్లోనూ పార్వతిని,పరమేశ్వరుణ్ణి స్తుతించాడు శ్రీనాథమహాకవి! పార్వతీదేవిచంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. . మరి, శివుడేమో చంద్రరేఖను తలపై కలిగినవాడు. నల్లని కాటుక వంటి దట్టమైన కురులను కలిగివుంది అమ్మ ... అయ్యవారి కంఠము నల్లనిది ....