Posts

Showing posts from May, 2024

ఆదిత్య హృదయం : అర్ధములతో

Image
  ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది. ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు… 1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం  అర్థము:  యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. 2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః  అర్థము:  యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను. 3. అగస్త్య ఉవాచ: రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి  అర్థము :  ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. 4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం ...

ఆదిత్య కవచం

Image
అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ । మాణిక్యరత్నఖచిత - సర్వాభరణభూషితం సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥ దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ । ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥ కవచం ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ । ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥ ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః । జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ॥ స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః । కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ॥ ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ । ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ॥ జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః । పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ॥ ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ । సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥ సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ । అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమం...

శ్రీ కుమార కవచం

Image
  ఓం శ్రీ గణేశాయ   నమః   ఓం శ్రీ కుమార గురవే నమః   ఓం నమో భగవతే భవబంధహరణాయ , సద్భక్తశరణాయ , శరవణభవాయ , శాంభవవిభవాయ , యోగనాయకాయ , భోగదాయకాయ , మహాదేవసేనావృతాయ , మహామణిగణాలంకృతాయ , దుష్టదైత్య సంహార కారణాయ , దుష్క్రౌంచవిదారణాయ , శక్తి శూల గదా ఖడ్గ ఖేటక పాశాంకుశ ముసల ప్రాస తోమర వరదాభయ కరాలంకృతాయ , శరణాగత రక్షణ దీక్షా ధురంధర చరణారవిందాయ , సర్వలోకైక హర్త్రే , సర్వనిగమగుహ్యాయ , కుక్కుటధ్వజాయ , కుక్షిస్థాఖిల బ్రహ్మాండ మండలాయ , ఆఖండల వందితాయ , హృదేంద్ర అంతరంగాబ్ధి సోమాయ , సంపూర్ణకామాయ , నిష్కామాయ , నిరుపమాయ , నిర్ద్వంద్వాయ , నిత్యాయ , సత్యాయ , శుద్ధాయ , బుద్ధాయ , ముక్తాయ , అవ్యక్తాయ , అబాధ్యాయ , అభేద్యాయ , అసాధ్యాయ , అవిచ్ఛేద్యాయ , ఆద్యంత శూన్యాయ , అజాయ , అప్రమేయాయ , అవాఙ్మానసగోచరాయ , పరమ శాంతాయ , పరిపూర్ణాయ , పరాత్పరాయ , ప్రణవస్వరూపాయ , ప్రణతార్తిభంజనాయ , స్వాశ్రిత జనరంజనాయ , జయ జయ రుద్రకుమార , మహాబల పరాక్రమ , త్రయస్త్రింశత్కోటి దేవతానందకంద , స్కంద , నిరుపమానంద , మమ ఋణరోగ శతృపీడా పరిహారం కురు కురు , దుఃఖాతురుం మమానందయ ఆనందయ , నరకభయాన్మాముద్ధర ఉద్ధర , సంసృతిక్లేశసి హి తం...