Posts

Showing posts from November, 2024

మచిలీపట్నం

Image
సరిగ్గా 160 ఏళ్ళ క్రితం ఇదే రోజు మచిలీపట్నం లో ఉన్న నాటి 65 వేల జనాభాలో 30 వేలమంది జలసమాధి !!                నవంబర్ ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే (సకల పునీతుల దినోత్సవం) 2 వ తేదీ ఆల్ సోల్స్ డే (సకల ఆత్మల దినోత్సవం) విశ్వవ్యాప్తంగా జరిగే రోజు. యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో తమెకేమీ జరుగుతుందో కూడా తెలియని స్థితిలో అర్ధరాత్రి  30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఐక్యమైపోయాయి                       నౌకా వ్యాపారంలో మచిలీపట్నం ఓడరేవు ఆనాడు ఆఅగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా  బ్రిటిష్ పాలకుల కాలంలో  విరాజిల్లుతుండేది. బందరు 1864 నవంబర్ 1 వ తేదీ అర్ధరాత్రి విరుచుకుపడిన భయంకర ఉప్పెనలో చిగురుటాకులా బందరు పట్టణం వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు  సముద్రతీరంలో  భారీ ఇసుకమేటలు వేయడంతో  బందరు అభివృద్ధి తిరోగమన దిశలో మొదలైంది. ఈ ఉప్పెన రాకతో  నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది.. ఓడలు వచ్చేందుకు తీరం వద్ద సరైన లోతు లేనందున భారీ ఓడల రాకపోకలకు మహా కష్టమైంది..నేటికీ ఆ ఇసుకమేటలు పెట్టని కోటలు మాదిరిగా ఏర్పడి బందరు పోర్టుకి శాపం అయింది. పోర్టు నిర్మాణానికి ఇసకను తవ్వెందుకు నిరంతర డ