Posts

Showing posts from March, 2026

నా జీవితంలో స్త్రీ మూర్తులు

 నా బామ్మని నేను ఎరగను. నా అమ్మమ్మ కి నేనంటే వల్లమాలిన అభిమానం. శివా అంటూ పిలిచేది. కకిలేర్లో కరెంట్ లేని రోజుల్లో రాత్రుళ్ళు పుడుకోబోయే ముందు చీకట్లో దడుసుకుంటూ అమ్మమా రావే ....ఒక్క కధ చెప్పవే అని పిలిచేవాళ్ళం. ఆవిడికి అప్పటికే వినపడేది కాదు. పది సార్లు పిలిస్తే గానీ వచ్చేది కాదు. వచ్చాకా ...కోటలూ, తోటలూ, రాజ కుమారులూ, గుర్రాలూ, కత్తి యుద్ధాలూ, సాము గరిడీలూ, అందమైన పడుచులూ, రాక్షసులూ, దెయ్యాలూ, అమ్మవార్లూ, అలాఅలా ఎందరెందరో మా మనో ఫలకాల మీద ప్రత్యక్షమై, వాళ్ళ పాత్రలు పోషించి కనుమరుగై పోయేవారు. నాలో ఏమన్నా సృజనాత్మకత వుంటే..... అది అమ్మమ్మ చలవే. నాకు వున్న ముగ్గురి మేనత్త లలోనూ నేను ఇద్దరినే ఎరుగుదును. పెద్దామె నాకు తెలిసేతప్పటికీ ఎనభై లలో వుండేది. మల్లెపువ్వు లాంటి, మడత నలగని చీర కట్టుకునేది. ఆమె మెడలో తళ్ళుక్కు మనే పగడాల దండ నాకు ఇంకా గుర్తే. చిన్న మేనత్త మమ్మల్ని బస్సుల్లో వాళ్ళ వూరు తీసుకెళ్ళేది. బస్సులు మారడం, రిక్షాలు ఎక్కడం నా చిన్న మేనత్త నేర్పినవే. నా మేన మామల భార్యలు ముగ్గురు. ఆప్యాయంగా పలకరించడం, కబుర్లు చెప్పడం, మర్యాదలు చెయ్యడం, వగైరాలనన్నీ వాళ్ళు నేర్పిన విద్యలే. నా తల...