Posts

Showing posts from November, 2026

జోహార్ మహానుభావా!

Image
ఇమేజ్: ప్రజాశక్తి  జోహార్ మహానుభావా!  డాక్టర్ త్సవట సత్యనారాయణ మూర్తి (బాబ్జీ) గారికి అశ్రునివాళి కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. కొంతకాలం మనతో ఉంటారు. ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు. కానీ మరికొంతమంది మాత్రం తమ వ్యక్తిత్వంతో, సేవాగుణంతో, మానవీయ విలువలతో మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం డాక్టర్ త్సవట సత్యనారాయణ మూర్తి గారిది. మనందరికీ ఆత్మీయులైన బాబ్జీ గారిది. ఆయనతో నా పరిచయం దాదాపు ఐదు దశాబ్దాల నాటిది. ఆ పరిచయంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. 1975... నా జీవితంలో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయిన సంవత్సరం. డయాబెటిక్ రెటినోపతి అనే కంటి జబ్బు కారణంగా మా నాన్నగారు కంటిచూపు కోల్పోయారు. ఆ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో తన ఉద్యోగాన్ని వదిలి, మా నాన్నగారు సొంత ఊరు పాలకొల్లు చేరుకున్నారు. కాకినాడలో కంటి వైద్యం ప్రారంభించారు. మా నాన్నగారికి బీపీ, షుగర్ సమస్యలు ఉండటంతో, వాటిని నియంత్రించేందుకు పాలకొల్లులో వైద్యం చేయించుకోవాలని, కంటి సమస్యను తాను చూసుకుంటానని కాకినాడలోని డాక్టర్ సూచించారట. ఈ విషయాలేవీ ...